Wednesday, January 22, 2025

ఎస్‌సి, ఎస్‌టి యాక్ట్ కేసు షాక్.. హీరో ఉపేంద్రకు ఊరట

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ప్రఖ్యాత కన్నడ, బహుభాషా నటుడు ఉపేంద్రకు దళిత వ్యతిరేక వ్యాఖ్యల కేసులో హైకోర్టు నుంచి ఉపశమనం దక్కింది. ఫేస్‌బుక్ లైవ్‌లో ఆయన తన మాటల సందర్భంలో దళితులను కించపరుస్తూ మాట్లాడారని ఎస్‌సి/ఎస్‌టి యాక్ట్ పరిధిలో రెండు కేసులు దాఖలు అయ్యాయి. వీటికి సంబంధించి విచారించాల్సి ఉందని, తమ నోటీసుకు అనుగుణంగా తమ ముందుకు రావాలని ఉపేంద్ర నివాసానికి కర్నాటక పోలీసులు చేరుకున్నారు.

ఈ లోగా దర్యాప్తు ప్రక్రియపై తాత్కాలిక స్టే ఇస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు రావడంతో పోలీసులు వెనుదిరిగారు. క్రేజ్ హీరోగా పేరున్న ఉపేంద్ర ఉత్తమ ప్రజాకీయ పార్టీ తలపెట్టారు. దీని గురించి మాట్లాడుతూ ఎక్కడ పట్టణం ఉంటుందో అక్కడ దళితులు ఉంటారని కించపర్చేలా ఓ కన్నడనానుడిని వాడి వ్యాఖ్యలకు దిగారు. దీనిపై దళిత సంస్థలు నిరసనలకు దిగాయి. వెంటనే ఉపేంద్ర ఈ లైవ్ వీడియోను తొలిగింపచేశారు. ఎవ్వరినైనా నొప్పిస్తే క్షమించాలని కోరారు. అయితే ఉపేంద్ర అరెస్టుకు సిద్ధం అవుతున్న దశలోనే ఆయనకు హైకోర్టు ఉత్తర్వులతో ఉపశమనం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News