Monday, December 23, 2024

కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర భార్య ఆకస్మిక మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన సోమవారం బ్యాంకాక్‌లోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందింది. స్పందన థాయ్‌లాండ్ కుటుంబ పర్యటనలో ఉంది. అనారోగ్యానికి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా స్పందన మృతి చెందింది. స్పందన మృతదేహం మంగళవారం బెంగళూరుకు చేరుకుంటుందని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆమె మృతదేహానికి నేడు బ్యాంకాక్‌లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

30 ఏళ్ల వయసులో ఉన్న స్పందన మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె పలు చిత్రాలలో కూడా నటించింది. స్పందన గుండెపోటుకు గురై చనిపోయిందని వైద్యులు తెలిపారు. ”ప్రముఖ కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర సతీమణి స్పందన మృతి నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. తన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.

స్పందన మృతి వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ దుఃఖంలో ఉన్న విజయ రాఘవేంద్ర, బి.కె.శివరామ్ కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News