Friday, January 10, 2025

తెలంగాణ వ్యవసాయ పథకాలకు జై కొట్టిన కన్నడ రైతు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ పథకాలకు కన్నడ రైతులు మూకుమ్మడిగా జై కొట్టారు. తెలంగాణ వంటి కిసాన్ సర్కారు దేశానికి అవసరం అన్న నినాదాలతో అక్కడి సభాప్రాంగణం హోరెత్తిపోయింది. అంబాని.. అదాని.. వంటి కార్పోరేట్ల పాలన వద్దు.. కిసాన్ సర్కారు పాలన ముద్దు అంటూ రైతులు చప్పట్లతో మోతపుట్టించారు. కర్ణాటక ముందర్గిలో సోమవారం జరిగిన రైతు బహిరంగ సభలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యలు శుభఫ్రద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పటేల్ మాట్లాడుతూ రైతు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని వెల్లడించారు. వ్యవసాయరంగ పథకాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉన్నదని కితాబిచ్చారు. ముందర్గి స్టేడియంలో కిసాన్ జాగృతి వికాస్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ తో కలిసి హాజరయ్యారు. కిసాన్ జాగృతి వికాస్ సంఘం ఆధ్వర్యంలో అక్కడ 75 జంటల సామూహిక వివాహాలు జరిపారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అక్కడి ప్రజలకు శుభప్రద్ పటేల్ వివరించారు. అన్నం పెట్టే రైతు అప్పులపాలు కాకూడదని, రైతు యాచించే స్థితిలో కాదు శాసించే స్థాయిలో ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతుబంధు, రైతుభీమా, సాగునీటి సదుపాయం, 24 గంటల ఉచిత కరెంట్ తో తెలంగాణ రైతులలో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ది లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం నిర్మింటంతో తెలంగాణ సస్యశామలంగా మారిందన్నారు. వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చేయూత దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నప్పటికీ తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణలో పెళ్లిల్లు జరిగితే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకంతో లక్షా నూట పదహారు రుపాయలు అందజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో రైతు సర్కార్ పాలన ఎలా నడుస్తోందో దేశంలో కుడా కిసాన్ సర్కార్ పాలన ఎంతో అవసరమన్నారు. కార్పొరేట్ (ఆదాని, అంబానీ) పాలన వద్దు, కిసాన్ సర్కార్ పాలన కావాలి అనే నినాదంతో సభలో రైతులందరిని హోరెత్తించారు. కన్నడలో మాట్లాడుతూ.. ”ముందిన గల్లల్లి కార్పొరేట్ సర్కార్ తగదుబెట్టి కిసాన్ సర్కార బర్ బేకు, నువెళ్ల కై జోడించి కిసాన్ సర్కార మాడబేకు” అంటూ జై కిసాన్ నినాదాలతో అక్కడి రైతులను శుభప్రద్ పటేల్ ఉత్సహపరిచారు. దేశంలో తెలంగాణ లాంటి కిసాన్ సర్కార్ అవసరం అన్న మాటకు అక్కడి రైతులు పెద్ద ఎత్తున్న చప్పట్లతో హోరెత్తించారు. జై కిసాన్ సర్కార్ అంటూ అక్కడి రైతులు తెలంగాణ పథకాలకు మద్దతు పలికారు. అనంతరం రైతు సంఘం నాయకులు మఠాధిపతులతో కలిసి కలిసి గోపూజ, నాగలి పూజ ధనరాశి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రైతు సంఘం అధ్యక్షుడు యుగంధర్ నాయుడు, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి గోవింద్ రావుతోపాటు పలువురు కర్ణాటక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News