కన్నడ భాషా కార్యకర్త, రచయిత పి.వి.నారాయణ(82) గురువారం బెంగళూరులో వయస్సుతో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా కన్ను మూశారు. ఆయన 1942 తుమకూరు జిల్లాలోని అక్కిరామ్‌పురాలో జన్మించారు. ఆయన పండితుడు. కన్నడ, ఇంగ్లీషుల్లో ఆయన ఎంఏ చేశారు. ఆయన బెంగళూరు, తుమకూరు, మైసూరు, ధార్వాడ్‌లలో చదువుకున్నారు. అనువాదకుడిగా ఆయన ఇంగ్లీష్, తెలుగు నుంచి 22 రచనలను అనువదించారు. ఆయన బెంగళూరులోని విజయ కాలేజ్‌లో 30 ఏళ్ల పాటు బోధించారు. అర్ధ శతాబ్దంగా ఆయన కన్నడ భాషా ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన 1980 దశకం ఆరంభంలో గోకక్ ఉద్యమాన్ని ఆరంభించారు. కన్నడకు శాస్త్రీయ భాషా హోదా సాధించేందుకు జరిపిన పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉదయభాను కళా సంఘలోని కన్నడ క్లాసికల్ లాంగ్వేజ్ స్టడీ సెంటర్‌లో డీన్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆయన కన్నుమూతపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సిఎం డి.కె.శివకుమార్ సంతాపాన్ని ప్రకటించారు.
కన్నడ భాషా కార్యకర్త, రచయిత నారాయణ ఇకలేరు
- Advertisement -
- Advertisement -
- Advertisement -