Sunday, December 22, 2024

అలా చేస్తే భారత సైన్యం తరహాలో తరిమికొడతాం: బొమ్మై

- Advertisement -
- Advertisement -

బెళగావి: చైనా సైనికుల తరహాలో కర్నాటకలోకి చొరబడతామంటూ శివసేన(ఉద్దవ్ థాక్రే) సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ చేఇన ప్రకటనను కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తీవ్రంగా ఖండించారు. చైనా సైన్యం తరహాలో చొరబడితే భారత సైన్యం తరహాలో వారిని తరిమికొడతామంటూ బొమ్మై హెచ్చరించారు. గురువారం బెళగావిలో ఆయన విలేకరులతో మాట్లాడుఊ తరచు రెచ్చగొట్టే ప్రకటనలు చేసే సంజయ్ రౌత్‌కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో అందరికీ తెలుసని అన్నారు.

మహారాష్ట్రలోని డ్యాంల ఎత్తు పెంచ నీరు కర్నాటకకు వెళ్లకుండా అడ్డుకోవాలంటూ మహారష్ట్ర శాసనసభ్యుడు చేసిన డిమాండును ప్రస్తావిస్తూ మహారాష్ట్రలోని ప్రతిపక్ష సభ్యులు ఈ ప్రకటన చేశారని బొమ్మై చెప్పారు. మనం ఫెడరల్ వ్యవస్థలో జీవిస్తున్నామని, నదీ జలాలు ఏ ఒక్క రాష్ట్రం సొత్తో కాదని ఆయన అన్నారు. నదీ జలాలు మూడు నాలుగు రాష్ట్రాలలో ప్రవహిస్తాయని ఆయన అన్నారు. జల వివాదాల చట్టం, ట్రిబుళ్లు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని ఆయన తెలిపారు. తమ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, తమ వాదనపై తమకు నమ్మకం ఉందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News