Wednesday, January 22, 2025

బుల్లితెర నటి పవిత్రా జయరాం దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ జిల్లా, భూ త్పూర్ మండలం, బి. శేర్ పల్లి గ్రా మం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రో డ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన బుల్లితెర ప్రముఖ నటి పవిత్ర జయ రాం (42) అక్కడికక్కడే మృతి చెందా రు. ఈ ఘటనలో మరో ముగ్గురు గా యపడ్డారు. పోలీసుల కథనం ప్రకా రం వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన పవిత్ర జయరాం గత కొ న్నేళ్లుగా బుల్లితెర నటిగా పాపులర్ అ య్యారు. త్రినయని అనే సీరియల్‌లో ఆమె ప్రముఖ విలన్ పాత్రలో నటిం చి మెప్పించారు.

తెలుగులో కూడా ఆ మె గత కొంతకాలంగా పలు సీరియ ల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కర్ణాటక వెళ్లిన ఆమె తమ గ్రామం నుంచి హైదరాబాద్ వస్తుండగా భూ త్పూర్ మండలం, బి శేర్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి డీవైడర్‌ను ఢీకొంది. అదే క్రమం లో హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తు న్న ఆర్‌టిసి బస్సును బలంగా ఢీకొం ది. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా ఆమె బంధువు ఆపేక్ష, సహనటుడు చంద్రకాంత్, డ్రై వర్ శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యా యి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్ర మాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News