Wednesday, January 22, 2025

కన్నడ సాహితీవేత్త చంద్రశేఖర్ పాటిల్ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కన్నడ నాట చంపగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ కన్నడ సాహితీవేత్త చంద్రశేఖర్ పాటిల్ సోమవారం నాడిక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధ రుగ్మతలతో కన్నుమూశారు. 82 సంవత్సరాల పాటిల్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వృద్ధాప్య సంబంధ వ్యాధులతో బాధపడుతున్న పాటిల్‌ను ఆదివారం రాత్రి ఆసుపత్రికి తరలించగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని కుటుంబ వర్గాలు తెలిపాయి. కవి, నాటక రచయిత అయిన పాటిల్ కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. కన్నడ సాహిత్యంలో బండాయ(ప్రగతిశీల) ఉద్యమ వ్యవస్థాపకులలో ఒకరైన చంద్రశేఖర్ పాటిల్ అనేక సాహితీ, రైతు ఉద్యమాలలో, ఆందోళనలలో పాల్గొన్నారు. గోకక్ ఆందోళన, బండాయ ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.

కర్నాటక యూనివర్సిటీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పనిచేసిన పాటిల్ ప్రముఖ సాహితీ పత్రిక సంక్రమణకు ఎడిటర్‌గా, కన్నడ వికాస సంస్థకు చైర్మన్‌గా కూడా పనిచేశారు. కర్నాటక సాహిత్య అకాడమీ, పంపా అవార్డులతోసహా అనేక అవార్డులు ఆయనను వరించాయి. పాటిల్ మృతికి కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంతాపం ప్రకటించారు. మాజీ ప్రధాని హెడ్‌డి దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, హెచ్‌డి కుమారస్వామి తదితర ప్రముఖులు పాటిల్ మృతికి సంతాపం ప్రకటించారు.

Kannada Writer Chandrashekhar Patil passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News