Wednesday, January 22, 2025

కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా!

- Advertisement -
- Advertisement -

ఇండస్ట్రీలో భారీ హిట్టు కొట్టాలనే కసితో  మంచు విష్ణు కన్నప్ప సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ న్యూజీలాండ్ లో కొనసాగుతోంది. ప్రభాస్ తో సహా భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా కోసం మంచు విష్ణు ఖర్చుకు వెనకాడటం లేదని టాక్. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, నయనతార వంటి అగ్రనేతారలు ఈ సినిమాలో నటిస్తున్నారు.

గురువారం (నవంబర్ 23) మంచు విష్ణు పుట్టిన రోజు. ఈ సందర్భంగా కన్నప్ప సినిమా నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చూసినవారంతా అద్భుతంగా ఉందంటున్నారు. ఎదురుగా బాణాలు దూసుకొస్తుంటే, విష్ణు విల్లు ఎక్కుపెట్టి వాటిని ఎదుర్కొంటున్నట్లు పోస్టర్ ను డిజైన్ చేశారు. విష్ణు మొహం కనిపించకుండా డిజైన్ చేశారు. పోస్టర్ లో భారీ శివలింగం కూడా ఉంది. పోస్టర్ ను చూసినవారంతా పాన్ ఇండియా స్థాయి సినిమాకు సరితూగే విధంగా పోస్టర్ ఉందని ప్రశంసిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప రూపొందుతోంది. నిర్మాత మోహన్ బాబు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News