Friday, April 4, 2025

‘కన్నప్ప’ విడుదల వాయిదా.. కారణం ఏంటంటే..

- Advertisement -
- Advertisement -

మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’. అయితే ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన విడుదల కావాల్సింది. కానీ, విఎఫ్ఎక్స్‌ పనులు ఇంకా మెరుగ్గా రావడం కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు విష్ణు స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

‘ఈ సినిమా ద్వారా అత్యున్నత ప్రమాణాలు కలిగిన సినిమాటిక్ అనుభూతిని కలిగించాలి.. అందుకు కొన్ని వారాల సమయం కావాలి. విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ సినిమా కోసం మీరంతా ఎదురుచూస్తున్నారని తెలుసు కానీ, ఆలస్యం అవుతున్నందుకు విచారిస్తున్నాం. కన్నప్ప శివుడికి ఎంత గొప్ప భక్తుడో అందరికి తెలుసు.. అలాంటి భక్తుడి కథను అద్భుతంగా మీ ముందు తీసుకురావాలని అనుకుంటున్నాం. కొత్త విడుదల తేదీతో మీ ముందుకు వస్తాం’ అంటూ మంచు విష్ణు పోస్ట్ చేశారు.

కాగా, ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎవిఎ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాకర్టీ బ్యానర్లపై మోహన్ ‌బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News