Tuesday, April 1, 2025

‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదా

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మంచు విష్ణు హీరో గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్‌తో డా. మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ గతంలో పలుసార్లు వాయిదా పడి ఈ ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చిత్ర యూనిట్ ప్రారంభించింది.

అయితే ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మరోసారి వాయిదా వేశారు. ఈ సినిమాను అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ వర్క్‌తో తెరకెక్కిస్తున్నామని.. దీని కోసం మరికొన్ని వారాల సమయం పడుతుందని.. మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాలని తాము కష్టపడుతున్నామని.. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్లు విష్ణు మంచు పేర్కొన్నారు. ఈ ప్రకటన చేస్తున్నందుకు అభిమానులు, ప్రేక్షకులకు ఆయన క్షమాపణలు చెప్పారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్ష య్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News