Sunday, January 19, 2025

వేసవి బరిలో మంచు విష్ణు ‘కన్నప్ప’..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘కన్నప్ప’ కూడా ఒకటి. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. పూర్తి మైథలాజికల్ చిత్రంగా రానున్న ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తోంది. అయితే, ‘కన్నప్ప’ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలో వెల్లడించింది. కానీ ఇప్పుడు ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయడం లేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “కన్నప్ప చిత్రాన్ని డిసెంబర్‌లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని సమ్మర్ 2025లో తీసుకొస్తున్నాం” అని మంచు విష్ణు తెలిపారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి వారు క్యామియో రోల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్‌కి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో పెద్ద రచ్చ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News