Monday, December 23, 2024

పుష్పను ఢీకొట్టబోతున్న ‘కన్నప్ప’

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2తో మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ ఢీకొనబోతుంది. పుష్ప2 ఆగస్టులో రిలీజ్ కానుండగా.. డిసెంబర్ కు వాయిదా వేశారు మేకర్స్. అయితే, ఇదివరకే కన్నప్ప చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని విష్ణు మంచు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

కాగా.. ఇటీవల విడుదల చేసిన ‘కన్నప్ప’ టీజర్‌తో సినిమా క్రేజ్ మరింతగా పెరిగింది. కన్నప్ప ఓ విజువల్ వండర్‌లా ఉండబోతోందని అందరికీ అర్థమైంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా ఉండబోతోందని తెలుస్తోంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News