కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి గోదావరి వరద
మునిగిన 17బాహుబలి మోటర్లు
మన తెలంగాణ: భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తొంది. వరదనీటి ఉధృతికి గురువారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ నీటమునిగింది. పంప్‌హౌస్‌లోకి వరదనీరు క్రమంగా చొచ్చుకొని వచ్చింది. దీంతో పంప్‌హౌస్‌లోని 17మోటార్లు వరద మునిగిపోయాయి. ఒక టిఎంసి, రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఈ పంపులు మునిగిపోయాయి. పంప్‌హౌస్‌లో కంట్రోల్ రూం వరకూ వరద చేరుకోవటంతో పంప్‌హౌస్ ప్రమాదపుటంచుల్లోకి చేరిపోయింది. వరద ఉధృతిని గమనించిన అక్కడి ఇంజినీర్లు పంప్‌హౌస్‌ను ముందుజాగ్రత్తగా ఖాళీ చేశారు. అయితే గురువారం ఉన్నట్టుండి గోదావరి వరద ప్రవాహం మరింత అధికమైంది. వరదనీరు కాళేశ్వరం ప్రాజెక్టులొని బ్యారేజీ కంట్రోల్ రూం, సిఆర్‌పిఎఫ్ క్యాంపు కార్యాలయాలను చుట్టుముట్టింది. దీంతో అందులో ఉన్న ఇంజినీర్లు, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది చిక్కుకుపోగా,రెస్కూ టీం అతికష్టం మీద అక్కడి నుంచి బయటకు తీసుకురాగలిగింది.
Kannepalli Pump house filled with heavy flood