Friday, December 20, 2024

ఎత్తిపోతల షురూ..

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి నుంచి ఎత్తిపోతలను అధికారులు సోమవారం ప్రారంభించారు. గత ఏడాది భారీ వర్షాలు, వరదలతో కన్నెపల్లి పంపుహౌస్ మునగడంతో నెలల తరబడి మరమ్మతులు చేపట్టిన ఇంజినీరింగ్ అధికారులు సోమవారం తిరిగి నీటిని కన్నెపల్లి పంపుహౌస్ పోయడం ప్రారంభించారు.

కన్నెపల్లి పంపుహౌస్‌లో ఐదు మోటార్లను నడిపిస్తూ జలాలను అన్నారం బ్యారేజీ, గ్రావిటీ కెనాల్ ద్వారా పంపిస్తున్నారు. దీంతో మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతం నుంచి 6400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 3టిఎంసిల నీరు నిలువ చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News