Monday, January 6, 2025

ప్రియుడితో కన్నతండ్రిని చంపించిన కూతురు

- Advertisement -
- Advertisement -

భోపాల్: ప్రియురాలు తన ప్రియుడితో కన్న తండ్రిని హత్య చేయించిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం దివాస్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిషార్ ఖాన్(45) అనే వ్యక్తి కన్నోడ్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నిషార్ ఖాన్‌కు భార్య రుక్సానా, కూతురు సిమ్రాన్ ఉన్నారు. విశాల్ అనే యువకుడిని సిమ్రాన్ ప్రేమించడంతో నిషార్ ఖాన్ వ్యతిరేకించాడు. దీంతో గత కొన్ని రోజుల నుంచి కూతురు, తండ్రి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిషార్ పక్కింట్లో ఉండే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తండ్రికి వ్యతిరేకంగా తల్లిని తన ఆధీనంలోకి తీసుకుంది. తండ్రి ప్రియురాలి భర్తతో తన కన్నతండ్రిని చంపాలని కూతురు కోరింది.

అతడు తిరస్కరించడంతో తన ప్రియుడిని మర్డర్ ప్లాన్‌లోకి తీసుకొచ్చింది. తన తండ్రి ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడు అని ప్రియుడు విశాల్ రు చేరవేసింది. నవంబర్ 22న పాల ప్యాకెట్ కోసం నిషాల్ మార్కెట్‌కు వెళ్తుండగా విశాల్ గన్‌తో అతడిపై 12 సార్లు కాల్పులు జరపడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అనంతరం విశాల్ హర్యానాలోని ఫరీదాబాద్‌కు పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

స్థానికంగా ఉన్న సిసి కెమెరాల ద్వారా విచారణ చేయడంతో పాటు కన్నోడ్, ఇండోర్ దాదాపుగా 25000 ఫోన్ కాల్స్‌ను పరిశీలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కూతురు, తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేయించామని ఒప్పకున్నారు. వెంటనే విశాల్‌ను ఫరీదాబాద్ లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి సహకరించిన దీపక్‌ను కూడా అరెస్టు చేశారు. తల్లి, కూతురును కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News