న్యూస్‌డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక బహుళ అంతస్తుల వాణిజ్య భవన సముదాయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి 500 దుకాణాలు దగ్ధమయ్యాయి. మొదట బాన్స్‌మండి ప్రాంతంలోని ఒక మల్టీస్టోరీ కమర్షియల్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు పక్కనున్న టవర్స్‌కు కూడా వ్యాపించినట్లు సీనియర్ అదికారి ఒకరు తెలిపారు.
గాలిదుమారం ఏర్పడిన తర్వాత షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు ఆ అధికారి తెలిపారు. అఫఖ్ రసూల్ టవర్స్‌లో తెల్లవారుజామున 2 గంటలకు ఏర్పడిన మంటలు హమ్రాజ్ కాంప్లెక్స్‌కు, నఫీస్ టవర్స్‌కు కూడా వ్యాపించాయని, మొత్తం 500కు పైగా దుకాణాలు తగలబడిపోయాయని ఆయన చెప్పారు.
రూ. 100 కోట్ల విలువైన సరుకులు, నగదు మంటల్లో బూడిదైపోయినట్లు అ ధికారి వివరించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శకటాలు అనేక గంటలుగా శ్రమిస్తున్నాయని ఆయన తెలిపారు. నాలుగు అంతస్తుల ఈభవనాలలో అన్ని షాపులు పూర్తిగా దగ్ధమైపోయినట్లు ఆయన తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను భవన నిర్వాహకులు పాఇంచడం లేదని ఆయన చెప్పారు.