Sunday, December 22, 2024

బాలికలపై నీట్ కోచింగ్ సెంటర్ టీచర్లు అత్యాచారం… ఇద్దరు అరెస్టు

- Advertisement -
- Advertisement -

లక్నో: బాలికలపై నీట్ కోచింగ్ సెంటర్ టీచర్లు అత్యాచారానికి పాల్పడి అనంతరం వీడియోను రికార్డు చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. అలాగే మరో యువతిని వేధించడంతో ఆమె పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు టీచర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కాన్పూర్‌లోని ప్రసిద్ధ నీట్ కోచింగ్ సెంటర్‌లో ఓ యువతి చేరింది. బయోలజీ టీచర్ సాహిల్ సిద్ధిఖీ తన ఇంట్లో పార్టీ ఉందని యువతిని ఆహ్వానించాడు. సిద్ధిఖీ ఇంటికి వెళ్లేసరి ఎవరు లేకపోవడంతో అనుమానం వచ్చింది. కూల్ డ్రింక్ మత్తు మందు ఇచ్చి యువతి చేత తాగించాడు.

ఆమె స్పృహ కోల్పోయిన తరువాత యువతిపై సిద్ధిఖీ అత్యాచారం చేశాడు. వీడియో రికార్డు చేసి ఆమెపై అతడు పలుమార్లు అత్యాచారం చేశాడు. కెమిస్ట్రీ టీచర్ వికాస్ పోర్వల్ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. అప్పటికే మరో యువతిని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన తరువాత సిద్దిఖీ బెయిల్‌పై విడుదలయ్యాడు. హోలీ పండుగ సందర్భంగా సదరు యవతి తన ఇంటికి వెళ్లింది. తిరిగి రాకపోతే కుటుంబాన్ని అంతం చేస్తానని సిద్దిఖీ బెదిరించాడు.  ధైర్యం చేసిన యువతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సిద్ధిఖీతో పాటు మరో టీచర్ వికాస్‌ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News