Wednesday, January 22, 2025

మర్డర్ ను బయటపెట్టిన ఓలా క్యాబ్

- Advertisement -
- Advertisement -

లక్నో: రూ. 40 కోట్ల ఆస్తి కోసం ఓ మహిళ చంపి మృతదేహాన్ని తరలించడానికి ఓలా క్యాబ్ బుక్ చేయడంతో మర్డర్ విషయం వెలుగులోకి వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలో జరిగింది. ఈ హత్యలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నోయిడాలో కుసుమా కుమారీ అనే మహిళ పేరును పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి రూ.40 కోట్ల విలువ ఉంటుంది. ఆమె చంపేస్తే ఆస్తి తనది అవతుందని మరది సౌరభ్ ప్లాన్ వేశాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కుసుమాను చంపేశారు.

Also Read: పాతబస్తీలో ఐదు స్టేషన్లు

కానీ మృతదేహాన్ని ఎక్కడ వేయాలో తెలియలేదు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఓలా క్యాబ్‌ను నోయిడా నుంచి మహారాజ్‌పూర్‌కు బుక్ చేశారు. డిక్కీలో గోనె బస్తాలను వేసేటప్పుడు ఓలా కారు డ్రైవర్ గమనించడంతో బస్తాకు రక్తపు మరకలు ఎక్కడివి అని ప్రశ్నించాడు. డ్రైవర్‌తో సౌరభ్, మరో వ్యక్తి గొడవకు దిగారు. వాళ్లు నుంచి తప్పించుకొని మహారాజ్‌పూర్ పోలీసులకు క్యాబ్ డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతదేహం కనిపించలేదు. ఫతేపూర్‌లో మృతదేహాన్ని గుర్తించి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News