Thursday, January 23, 2025

అమెరికాలో టోర్నడో విధ్వంసం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో సోమవారం అత్యంత శక్తివంతమైన టోర్నడో వెలువడింది. ఇది వందలాది ఇళ్లు , భవనాలను దెబ్బతీసింది. సుడులు తిరుగుతూ వికృతరీతిలో కన్పించిన ఈ పెనుసుడిగాలి పరిణామాన్ని మెట్రోలాజిస్టు రీడ్ టిమ్మెర్ వీడియో తీశారు.ఈ టోర్నడో ధాటికి పలువురు గాయపడ్డారు. దీని ప్రభావం ఎక్కువగా అండోవరెర్ శివారు ప్రాంతం విచితాపై పడింది. భయంకరమైన పొగలు కక్కుతూ పరిసరాలలోని దుమ్మూధూళితో నేలంతా మబ్బుగా పర్చుకుంటూ చాలా సేపటి వరకూ తన వలయపు దారిలో విధ్వంసం సృష్టించిన ఈ టోర్నడో దృశ్యాలు ఇంటర్నెట్‌లో సంచలనాత్మకంగా నెటిజన్లు తిలకించారు.

ఇప్పటికే దాదాపు మూడు కోట్ల మంది వరకూ దీనిని తిలకించినట్లు నెట్ వీక్షక రేటింగ్‌లతో స్పష్టం అయింది. ఈ సుడిగాలితో ఎటువంటి ప్రాణనష్ఠం జరగలేదు. అయితే దీనిఅంతర్గత శక్తి వేగం ఎంతటి తీవ్రతరం అయినదనేది దృశ్యాల సాయంతో పర్యావరణ వేత్తలు అంచనావేశారు. ఈ టోర్నడోతో వంద నిర్మాణాలు ధ్వంసం అయినట్లు తెలిసిందని విచితా మేయర్ తెలిపారు. అమెరికాలో తరచూ స్వల్ప లేదా తీవ్రస్థాయి ఇటువంటి టోర్నడో సుడిగాడ్పులు వీస్తుంటాయి. పెను విధ్వంసం సృష్టిస్తాయి. శీతల తేమభరిత అస్థిర వాయు పరిణామాల నడుమ , హిమపాతాలకు ముందు ఇటువంటి పరిణామాలు సంభవిస్తుంటాయి. నల్లని ధట్టమైన మేఘాల మాదిరిగా ఈ టోర్నడోలు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News