Friday, November 15, 2024

సుమన్‌కు కాంతారావు శత జయంతి పురస్కారం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలుగు సినీ జగత్తులో దిగ్గజ నటుడు టి.ఎల్. కాంతారావు సినీ కళామతల్లికి చేసిన సేవలు నిరుపమానమైనవని తెలంగాణ రాష్ట్ర పర్యాకట అభివృద్ది మండలి ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావులు అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఫిలీంనగర్ ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌హాల్‌లో సాంస్కృతిక సంస్థ ఆకృతి నిర్వహణలో సుప్రసిద్ద సినీనటుడు “టి.ఎల్.కాంతారావు శతజయంతి మహోత్సవం” వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హీరో సుమన్ కు “శతజయంతి పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికీ. అకృతి అధ్యక్షుడు సుధాకర్ సమన్వయవక్తగా వ్యవహరించగా, ఉప్పల శ్రీనివాస్‌గుప్త అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, ఫిక్కి సీబఎమ్‌డి అచ్యుత జగదీశ్‌చంద్ర, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వ్యక్తలు మాట్లాడూతూ సాంఫీుక, జానపద, పౌరాణిక పాత్రలతో అలరించిన కాంతారావు “మహానటుడు” అని కొనియాడారు.. సినిమాలలో కత్తితో ఆయన చేసిన సాహస ప్రదర్శనలు “కత్తి కాంతారావు”గా ప్రసిద్ది నిచ్చాయన్నారు. 400 చిత్రాలకు పైగా నటించిన కాంతారావు జీవితం అమూల్యమైనదన్నారు. జానపద చిత్రాలలో, సాంఫీుక చిత్రాలలో బలమైన పాత్రలు పోషించి సామాన్యులకు దగ్గరైన విలక్షణ నటుడు కాంతారావు అని శ్లాఘించారు. ఆ మహనీయుడి శతజయంతి సందర్భంగా ప్రముఖ వర్థమాన అగ్ర నటుడు “సుమన్‌” కు “కాంతారావు పేరా ఆకృతి శతజయంతి పురస్కారం” అందజేయడం సముచితంగా ఉందని అన్నారు. నటనతో పాటు కరాటేలో నిపుణుడైన సుమన్ పెద్ద యాక్షన్ హీరోగా ఎంతోమంది అభిమానులు సంపాందించుకున్నారన్నారు. అలాగే సుమన్ సినిమాలలో మార్షల్ ఆరట్స్‌ను ప్రవేశపెట్టి ఎంతోమంది యువతను ప్రభావితం చేశారన్నారు.

కథానాయకుడు, ప్రతినాయకుడు, పౌరాణిక పాత్రలు మున్నగు అన్ని పాత్రలలో నటించిన “సుమన్‌” తెలుగు, తమిళ, కన్నడ పలు భాషలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. కాంతారావు నాటి తారానికి, సుమన్ నేటి తరం ప్రజలలో అత్యంత ప్రతిభావంత తారలుగా గుర్తింప బడ్డారని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ అగ్ర హీరో లు ఎన్టీర్ ,అక్కినేని చిత్ర సీమలో అగ్ర హీరో లు వెలుగొందుతున్న సమయం లో తన అసమాన ప్రతిభ తో కాంతా రావు రానించారని కొనియాడారు. ఫిక్కీ సిఎండి అచ్యుత జగదీష్ చంద్ర మాట్లాడుతూఒక గొప్ప కార్యక్రమంలో భాగం పంచు కోవడం అదృష్టం అన్నారు.. అవార్డు గ్రహీత సుమన్ స్పందిస్తూ. ఆకృతి సంస్థ అవార్డుల ఎంపిక ఎంతో నిబద్దత తో ఉంటుంది అన్నారు.. కాంతా రావు శత జయంతి అవార్డు అందు కోవడం గొప్ప అవకాశం అన్నారు.. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News