- Advertisement -
కాంతార 2 సినిమాను నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని హోంబలే ప్రొడక్షన్ నిర్మాత తెలిపారు. కాంతారు సినిమాకు సీక్వెల్? లేక ప్రీక్వెల్? అనే దానిపై ఆలోచన చేస్తున్నామని వివరించారు. దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం అందుబాటులో లేరని, అతడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రిషబ్ ఓకే అంటే అతి త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని హోంబలే ప్రొడక్షన్ నిర్మాత తెలిపారు. కాంతారా సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర కన్నడ సినిమా మ్యాజిక్ చేసింది. ఎవరూ ఊహించని రీతిలో ప్రభంజనం సృష్టించింది. హిందీ, తమిళం, తెలుగలో డబ్ చేయడంతో కలెక్షన్లలో దూసుకెళ్లింది.
- Advertisement -