Friday, December 20, 2024

‘కాంతార చాప్టర్-1’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

కన్నడ స్టార్ రిషభ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కాంతార చాప్టర్ 1’. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. రిషభ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 2025 అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’వరల్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇండియాలో దసరా బిగ్గెస్ట్ సీజన్.

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్‌కు ఇది పర్ఫెక్ట్ టైమ్. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రిషభ్ శెట్టి ఫెరోషియస్ అవతార్‌లో కనిపించారు. ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో గొడ్డలి పట్టుకొని లెజెండ్‌గా కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. ‘కాంతార చాప్టర్1’ కోసం నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి తన పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. కేరళ నుండి ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో రిషబ్ కఠినమైన శిక్షణ పొందారు. కాంతార కొంకణ్ జానపద గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News