Monday, January 20, 2025

యూనివర్సల్ కథతో ‘కాంతారా’

- Advertisement -
- Advertisement -

 Kantara movie to release in Telugu on Oct 15

‘కెజిఎఫ్’ సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్ సంస్థ ప్రస్తుతం రిషబ్ శెట్టి హీరోగా రూపొందిస్తున్న సినిమా ‘కాంతారా’. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‘ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ‘కాంతారా’ అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లాదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈనెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటైన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ… “డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి ‘కాంతారా’ ఖచ్చితంగా నచ్చుతుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ‘పుష్ప‘ సినిమా చూసిన ప్రేక్షకులు ఎంత ఆనందపడ్డారో ఇప్పుడు వస్తున్న ఈ సినిమాను కూడా ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్‌గా తీయడమే కాకుండా విష్ణు తాత్వాన్ని కూడా బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకొని తీయడం జరిగింది. ఇటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన సినిమాలు ఈ మధ్య సూపర్ హిట్ అయ్యాయి. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడమే కాకుండా ఇందులో అద్భుతంగా నటించాడు”అని అన్నారు. హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి మాట్లాడుతూ “యూనివర్సల్ కథతో వస్తున్న ‘కాంతారా‘ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ఖచ్చితంగా చెప్పగలను. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను”అని తెలిపారు. ఈ సమావేశంలో హీరోయిన్ సప్తమి గౌడ, రాంబాబు గోశాల పాల్గొన్నారు.

 Kantara movie to release in Telugu on Oct 15

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News