Wednesday, January 22, 2025

బండి సంజయ్ ఆ రూ.700 కోట్లు ఎక్కడివి: గజ్జల కాంతం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బిజెపి నియంతగా దేశాన్ని పాలిస్తుందని ప్రజాసంఘాల జెఎసి చైర్మన్ గజ్జల కాంతం తెలిపారు. రాజ్యాంగం కాకుండా అర్ ఎస్ ఎస్ డైరెక్షన్ లో నడుపుతోందన్నారు. ప్రెస్ క్లబ్ నుంచి గజ్జల కాంతం మీడియాతో మాట్లాడారు. సిబిఐ, ఐటి, ఇడి తదితర కేంద్ర సంస్థలు బిజెపికి ఏజెంట్ గా పని చేస్తున్నాయని దుయ్యబట్టారు. వీరు రాజ్యాంగ పరిధిలో కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్ లో పని చేస్తున్నాయన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ సంస్థలు ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో ప్రాంతీయ, ప్రతిపక్ష పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లోనే సిబిఐ, ఇడి, ఐటి దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.

బిజెపి దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని, దేశ సంపదను పేదలకు పంచాలని లేదని, ప్రభుత్వ రంగ సంస్థలను దగ్గర పెట్టుకుని దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. దేశ ప్రజల సంపదను మొత్తం అదానీ, అంబానీకి కేంద్రం దోచిపెడుతుందని గజ్జల కాంతం దుయ్యబట్టారు. 2014లో అదానీ, అంబానీ ఆస్తులు ఎన్ని ఉన్నాయని, 2022 అంబానీ, అదాని ఆస్తులు ఎంత? అని పశ్నించారు. అదానీ, అంబానీలపై ఐటి దాడులు ఎందుకు చేయడం లేదని అడిగారు.

ఈ సంస్థలలో 50 శాతం వాటా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాదే అని, దేశానికి సంపదని ఇస్తున్న సింగరేణి నీకి 51 శాతం రాష్ట్రానిది అని చెప్పిన పిఎం ఢిల్లీకి వెళ్లగానే 4 సింగరేణి సంస్థల బ్లాక్ లను ప్రైవేటీకరణ చేశారని మండిపడ్డారు. మోడీ, అమిత్ షా లు కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రాష్ట్రాలపై విషం కక్కుతున్నరని ధ్వజమెత్తారు. దేశ సంపద సిఎం దోచుకున్నారా?, కవిత దోచుకున్నారా? అనేది ప్రజలకు తెలుసునన్నారు. దోచుకున్న వారిని వదిలేసి తెలంగాణ ప్రజలకు అనేక పథకాలను పెట్టి అభివృద్ధితో ముందుకు తీసుకు వెళ్తుంటే… మీరు కక్ష సాదింపుగా ఇడి, ఐటి, సిబిఐ సంస్థలతో దాడులు చేయించడం సరికాదన్నారు. బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లు దేశంలో మీరు సీతనే గౌరవించలేదని చురకలంటించారు. కవిత తెలంగాణ ఆడ బిడ్డ, ఆమెపై సిబిఐ విచారణ పేరుతో వేధించడం అంటే సీత లాంటి ఆడ బిడ్డపై దాడులు చేసినట్టేనన్నారు.

ప్రజలంతా తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నారన్నారు. బిజెపోళ్లను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కి రూ.700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వ్యాపారులు, గ్రానైట్ వద్ద బెదిరించి సంజయ్ డబ్బులు వసూలు చేస్తున్నారని గజ్జల కాంతం ఆరోపణలు చేశారు. బండి సంజయ్ పై దాడులు చేయించాలని, వందల కోట్లు సంపాదించిన బిజెపి నాయకులపై ఎక్కడ దాడులు ఉండవన్నారు. బిజెపి పాలిత కర్ణాటకలో వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. మద్య ప్రదేశ్ లో సిఎం, మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఒక్కో వ్యక్తి పేరున వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని, మరి అక్కడ దాడులు చేశారా? అని ప్రశ్నించారు.

కేవలం తెలంగాణ రాష్ట్రంపై సిబిఐ, ఇడి, ఐటి దాడులు ఎందుకు అని అడిగారు. మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు 140 సంస్థలు ప్రైవేటీకరణ చేయడంతో లక్షల మంది కార్మికులు రోడ్డున పడి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో యువతకు ఉద్యోగాలు లేవన్నారు. నల్ల ధనం తెచ్చి 15 వేలు వేస్తామని చెప్పి మోడీ అధికారంలోకి వచ్చారని, ఇప్పటివరకు నల్లధనం బయటకు తీయలేదని, దేశ ప్రజల సొమ్ము అంబానీ, అదానీలకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. మోదీ, అమిత్ షాలు వచ్చాక ప్రజాస్వామ్య పద్ధతులకు భిన్నంగా పెట్టుబడి దారుల కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News