Monday, December 23, 2024

కెసిఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనం : మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ అమీర్ పేటలోని వివేకానంద కమ్యూనిటి హాల్ లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ చేస్తుంది, దేశం అనుసరిస్తోందని మిషన్ కాకతీయ , మిషన్ భగీరథ రైతుబంధు, రైతు భీమా వంటి కార్యక్రమాలు కెసిఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ పథకలు బాగున్నాయని, ఇతర రాష్ర్టాల్లో కూడా చేస్తామంటున్నారని మంత్రి తెలిపారు.

మన కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా దేశం అనుసరించాల్సిందే అని పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు వారి ఇంటికే తీసుకెళ్ళి ఇస్తున్నామని, పార్టీలకు అతీతంగా కంటి వెలుగు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మంచి అవకాశమని దీని అందరు సద్వినియోగ పరచుకోవాలని వివరించారు. . 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేస్తామని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, కాలనీలకే కంటి వెలుగు బృందాలు వస్తాయన్నారు. చివరి మనిషి వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కంటి వెలుగు సేవలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News