Monday, January 20, 2025

కంటి వెలుగు… 1500 టీమ్స్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: గతంలో కోటి 50 లక్షల మందికి కంటి స్కీనింగ్ పరీక్షలు చేశామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. 2వ విడత కంటి వెలుగు ఏర్పాట్లపై మంత్రి హరీష్ రావు ఉన్నతస్థాయి సమీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల డిఎంహెచ్ లు, డిప్యూటీ డిఎంహెచ్ లు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఇది అత్యంత పెద్ద స్కీనింగ్ అని అన్నారు. రూ.200 కోట్ల నిధుల విడుదలకు జివొ జారీ చేశామని, వంద రోజుల్లో కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మొదటి దశలో 800 టీమ్స్ ఏర్పాటు చేశామని, 2వ దశలో 1500 టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 1500 టీమ్స్‌కు 1500 మంది డాక్టర్లు, 1500 ఎఆర్‌టి యంత్రాలను ఇస్తున్నామని, జనవరి 5న కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. గతంలో 50 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చామన్నారు. ఈ సారి 55 లక్షల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. 30 లక్షల వరకు రీడింగ్ గ్లాసులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. వైద్యులు రాసిచ్చే కంటి అద్దాలను నెల రోజుల్లో అందిస్తామని, ఇంకా ఎక్కువ అవసరం అయితే కూడా అందిస్తామని హరీష్ రావు వివరించారు. కంటి సమస్యతో ఎవరు బాదపడకూడదని సిఎం కెసిఆర్ ఆలోచన చేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News