Monday, December 23, 2024

ఇంటివద్దే కంటి శిబిరం

- Advertisement -
- Advertisement -

మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని రాష్ట్ర వైద్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గేటెడ్ క మ్యూనిటీ, వాళ్లు జిహెచ్‌ఎంసికి ట్వి ట్టర్, వెబ్‌సైట్‌లో రిక్వెస్ట్ పెడితే వారు కోరుకున్న చోటుకి కంటి వెలుగు బృందాలు వెళతాయని తెలిపారు. అవసరమైన కళ్లద్దాలను ఎఎన్‌ఎంలు ఇంటి కే తెచ్చి ఇస్తారని చెప్పారు. కంటివెలుగు రెండో వి డత ప్రారంభోత్సవం సందర్భంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన పథకాలను ప్రశంసించారని తెలిపారు. అమీర్‌పేటలోని వివేకానందా క మ్యూనిటీ హాల్‌లో కంటివెలుగు శిబిరాన్ని మంత్రు లు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రా రంభించారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి క మిషనర్ లోకేష్‌కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మా ట్లాడుతూ నుంచి రెండో విడుత కంటివెలుగు ప్రారంభమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని చె ప్పారు. మన పథకాలను అనేక రాష్ట్రాలు, కేంద్రం అనుసరిస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు బెంగాల్ చేసిందే దేశం అనుసరించేదని, ఇప్పుడు తెలంగాణను అనుసరిస్తుందని వ్యాఖ్యానించారు. కల్యాణ లక్ష్మీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, రైతుబంధు, కెసిఆర్ కిట్ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
16,533 కేంద్రాల్లో కంటి పరీక్షలు
కంటి వెలుగును పంజాబ్, ఢిల్లీలో అమలు చేస్తామనడం తెలంగాణకు గర్వకారణమని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 16,533 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 1,500 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్‌లో 8 మంది సిబ్బంది ఉంటారని వివరించారు. ఒక్కో బృందం రోజుకు 120 నుంచి 130 మందికి పరీక్షలు చేస్తాయని అన్నారు. వంద రోజుల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని వెల్లడించారు. అవసరమైనవారికి కళ్లద్దాలు, మందులు అందజేస్తామని అన్నారు. నివారించదగిన అంధత్వ సమస్యలు నిర్మూలించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2018లో మొదటి విడత కార్యక్రమం 8 నెలల్లో పూర్తి చేశామని చెప్పారు.

ఈసారి తెలంగాణలో తయారైన కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. 20 లక్షల కళ్ళజోళ్ళు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో కూడా కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేస్తామని, జర్నలిస్ట్‌లు, వారి కుటుంబాలకు టెస్ట్‌లు చేస్తామని చెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కంటిచూపు కోసం ఇంతటి భారీ కార్యక్రమం ఎవరూ చేపట్టలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజల కోసం సిఎం కెసిఆర్ మహత్తర కార్యక్రమం ప్రారంభించారన్నారు.
ప్రపంచరికార్డు సాధించేలా కంటి వెలుగు : సిఎస్ శాంతి కుమారి
ప్రపంచరికార్డు సాధించేలా రాష్ట్రంలో కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. ఎ.వి.కళాశాలలో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణను సిఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వి, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతిలతో కలిసి కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, 2018లో నిర్వహించిన తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో దాదాపు 1.57 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించారని, ప్రస్తుత కంటి వెలుగు కార్యక్రమంలో తొలి విడత రికార్డుని అధిగమించి సరికొత్త రికార్డు సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత కంటి వెలుగును సమర్దవంతంగా నిర్వహించడానికి 15 వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందితోకూడిన 1500 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12,768 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 3,788 శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో నాణ్యమైన కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి అక్కడికక్కడే రీడింగ్ అద్దాలను పంపిణీ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నిర్దారిత ప్రాంతాల్లో గురువారం కంటి వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయని శాంతికుమారి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News