Monday, January 6, 2025

మూడవ రోజు కంటి వెలుగు సక్సెస్

- Advertisement -
- Advertisement -

మోస్రా: నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు ప్రోగ్రాంలో సోమవారం సుమారు 160 మంది రోగులు కంటి పరీక్షలు చేయించుకోగా కొంత మంది రోగులకు కంటిలో మోతిబిందువు ఉన్నట్లు తేలడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ విజయ్‌కుమార్ తెలియజేశారు. ఈ కంటి వెలుగు కార్యక్రమంకు ప్రజల నుండి విశేష స్పందన వస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలియజేశారు. ఈ కంటి వెలుగు ప్రోగ్రాంలో ఎంపిడివో భారతి, ఎంపిఓ రఫీ, ఆయూస్ మెడికల్ ఆఫీసర్ జోత్న్సా, ప్రాథమిక ఆరోగ్య ఏఎన్‌ఎంలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు ఈకార్యక్రమంలో విశేష సేవలను అందిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News