Sunday, December 22, 2024

ప్రజలకు ఆనందబాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీళ్లు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట ప్రతినిధి: సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక కంటి పరీక్షలు తెలంగాణలోనే జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీ రు హరీశ్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేం ద్రంలోని 26 వార్డులోని ఏకలవ్య సంఘంలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒ క్కరూ అంధత్వంతో భాదపడవద్దన్న లక్షంతో సి ఎం కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రజలు అడకగ ముందే పెద్ద కొ డుకులా ఈ కార్య్రమాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించడం ప్రజల్లో ఎంతో సంతోషం కలుగుతుందన్నారు.

కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి 25 రోజుల్లో 50 లక్షల మందికి కం టి పరీక్షలు పూర్తి చేశామన్నారు. జూన్ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా 100 శాతం కంటి పరీక్షలు పూర్తి చేస్తామన్నారు. 50 లక్షల మందిలో 16 లక్షల మందికి కంటి సమస్యను గుర్తించి కళ్ల అద్దాలు అందించి కంటి వెలుగులను ప్రసాదించామన్నారు. అలాగే 34 లక్షల మందికి కంటి పరీక్షలు చేయడంతో ఎలాంటి సమస్య లేదని వారిలో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో ప్రజల్లో ఆనందం కలుగుతుంటే ప్రతి పక్షాల కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయన్నారు.కళ్లద్దాలు సైతం మన ఇండియాలోనే తయారైనవి మాత్రమే ఇస్తున్నామన్నారు.

కులం మతం తేడా లేకుండా మానవత్వమే ముఖ్యమంటూ రాష్ట్ర సర్కార్ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన వారికి సైతం కంటి పరీక్షలు చేస్తున్నామన్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో 827 బృందాలు పని చేయగా, రెండవ విడతలో 1500 బృందాలు వారానికి ఐదు రోజుల చొప్పున పని చేస్తున్నాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు చేస్తూ అవసరపడే వారికి మందులు, కళ్లద్దాలు అందించడంతో పాటు అత్యవసరం అయితే ఆపరేషన్ సైతం చేయిస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు కొనసాగించిన స్ఫూర్తితోనే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో వార్డు స్థ్ధాయి మెంబర్ నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారని అన్నారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ , వైద్య శాఖ అధికారులు, సిబ్బంది సైతం ఈ కార్యక్రమం విజయానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్ననన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రదానం అని కళ్లు లేకుంటే ప్రపంచమే చీకటవుతుందన్నారు. కంటి వెలుగు నిర్వహణ కోసం రూ.250 ఖర్చు చేస్తున్నామన్నారు. అసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. మంత్రి వెంట జిల్లా వైద్యాశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ , ప్రజాప్రతినిధులు ,నాయకులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్‌రెడ్డి, పాల సాయిరాం, కెమ్మసారం ప్రవీణ్‌కుమార్, సద్ది నాగరాజు రెడ్డి, సాయిగౌడ్, సుమన్‌రెడ్డి, కిట్టు, సురేశ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News