డెహ్రాడూన్: భారత జవాన్ ను శివుడు భక్తులు (కన్వారీ) పొట్టన పెట్టుకున్న సంఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. ఆరుగురు భక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముజఫర్‌నగర్ ప్రాంతం సిసౌలీ గ్రామానికి చెందిన కార్తీక్ భారత్ సైన్యంలో జవాన్‌గా సేవలందిస్తున్నాడు. గుజరాత్‌లోని జాట్ రెజిమెట్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కు తనకు తెలిసిన వారితో కలిసి గంగ జలం తీసుకరావడానికి వెళ్లాడు. హరాన్యా రాష్ట్రానికి చెందిన రెండు గ్రూపులు హరిద్వార్ వీధుల్లో బైక్‌లతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండగా వారిపై కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే వారు కార్తీక్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలపై బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడని పోలీసులు తెలిపారు. హరిద్వార్ ఎస్‌పి ప్రమేంద్ర దోభల్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితులు హర్యానాకు చెందిన సుందర్(38), రాహుల్(20), సచిన్(25), ఆకాశ్ (21), పంకజ్(22), రింకూ(24) అని పోలీసులు వివరాలు వెల్లడించారు.
జవాన్ ను పొట్టన పెట్టుకున్న శివుడు భక్తులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -