Monday, March 3, 2025

చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలో చర్చి పండుగలో విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుత్తేంతురైలో సెయింట్ ఆంథోనీ చర్చిలో ఉత్సవాలు జరుగుతుండగా కరెంట్ షాక్ తగిలి నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ప్రత్యేకంగా తయారు చేసిన రథాన్ని ఉరేగిస్తుండగా కరెంట్ వైర్లు దానికి తాకాయి. విద్యుత్ షాక్ కొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆంటోనీ, శోభన్, మరియా విజయన్, మైఖేల్ పింటో అని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News