- Advertisement -
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ పేర్కొన్నాడు. రోహిత్ వరుస వైఫల్యాలు చవిచూడడం ఆలోచించే అంశమేనన్నాడు. కెప్టెన్ వరుస వైఫల్యాలు చవిచూస్తే దాని ప్రభావం జట్టుపై కచ్చితంగా ఉంటుందన్నాడు. మిగిలిన రెండు మ్యాచుల్లో రోహిత్ తన బ్యాటింగ్ తీరును మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. రోహిత్ గాడిలో పడితేనే మెగా టోర్నీలో టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నాడు. లేకుంటే జట్టుకు ఇబ్బందులు ఖాయమని కపిల్ జోస్యం చెప్పాలి.
- Advertisement -