Saturday, November 9, 2024

ఓటమికి సాకులొద్దు: కపిల్‌దేవ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో టీమిండియా కనీసం సెమీఫైనల్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టు పేలవమైన ప్రదర్శనకు కెప్టెన్ కోహ్లితో సహా సహాయక కోచ్‌లు చెబుతున్న కారణాలు సహేతుకంగా ఉండడం లేదు. తాజాగా బౌలింగ్ కోచ్ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ భారత్ ఓటమికి టాస్‌లే కారణమని పేర్కొన్నాడు. దీన్ని భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ తప్పుపట్టాడు. టాస్ వల్లే మ్యాచ్‌లు ఓడిపోయామనడం ఏమాత్రం సమంజసంగా లేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టాస్‌లు ఒక్కటే కీలకమనే విషయాన్ని భారత బౌలింగ్ కోచ్ మరిచిపోయినట్టు ఉన్నాడని దెబ్బిపొడిచాడు. ఓటమిని హుందగా స్వీకరించాల్సింది పోయి ఇలాంటి అర్థం పర్థంలేని కారణాలు చెప్పడం ఏమాత్రం సముచితం కాదన్నాడు. తొలి రెండు మ్యాచుల్లో భారత్ ఓటమికి పేలవమైన ఆటే కారణమని కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘకాలం పాటు బయోబబుల్ ఉండడం, ఐపిఎల్‌లో ఎడతెరిపి లేని మ్యాచ్‌లు ఆడడం వల్ల భారత క్రికెటర్లు పూర్తిగా అలసిపోయారన్నాడు. అందుకే తొలి రెండు మ్యాచుల్లో తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక ఓటమి పాలైందని కపిల్‌దేవ్ పేర్కొన్నాడు.

Kapil Dev comments on India exit from T20 World Cup

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News