Friday, December 20, 2024

భారత్ ఖాతాలో 25వ పతకం

- Advertisement -
- Advertisement -

ఇక్కడ జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ హవా కొనసాగుతూనే ఉంది. ఈ క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 25వ పతకాన్ని సాధించింది. పురుషుల జూడోలో భారత్‌కు చెందిన కపిల్ పర్మార్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 60 కిలోల జె1 విభాగంలో కపిల్ అద్భుత ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. కాంస్యం కోసం జరిగిన పోరులో కపిల్ పర్మార్ 100 తేడాతో బ్రెజిల్‌కు చెందిన ఎలిల్టన్ డి ఒలివెరాను ఓడించాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన కపిల్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. కాగా, పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు గెలుచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News