Friday, January 10, 2025

ఫేస్‌బుక్ లైవ్‌లో నటుడి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే కామెడీ సర్కస్ కే అజూబేలో సహ నటుడిగా నటించిన తీర్థానంద్ రావు మంగళవారం ఫేస్‌బుక్ లైవ్‌లో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

తన అఫిషియల్ ఫేస్‌బుక్ పేజ్‌లో లైవ్ వీడియోలో కనిపించిన తీర్థానంద్ తాను ఒక మహిళతో సహజీవనంలో ఉన్నానని, తన ఈ పరిస్థితికి ఆమే కారణమని ఆరోపించాడు. ఆ మహిళ తనను భావోద్వేగంతో బ్లాక్‌మెయిల్ చేస్తోందని, తన వద్ద నుంచి డబ్బు వసూలు చేసిందని అతను ఆరోపించాడు.

ఆమె కారణంగా రూ. 4 లక్షల అప్పు చేశానని, గత ఏడాది అక్టోబర్ నుంచి ఆమె తనకు పరిచయమని తీర్థానంద్ తెలిపాడు.భయందర్‌లో ఆమె తనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని, కారణమేమిటో కూడా తనకు తెలియదని అతను వాపోయాడు. ఆమె తనకు ఫోన్ చేసి కలుసుకుందామని చెప్పిందని అతను వీడియోలో తెలిపాడు. తీర్థానంద్ బాటిల్‌లో ఉన్న క్రిమిసంహారక మందును గ్లాసులో పోసుకుని తాగడం వీడియోలో కనిపించింది.

వీడియోను చూసిన అతని స్నేహితులు వెంటనే అతని ఇంటికి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో తీర్థానంద్ కనిపించాడు. పోలీసులకు సమాచారమిచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News