Sunday, December 22, 2024

ప్రధాని మోడీకి సిబల్ సవాల్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 2016 నవంబర్ 16న పెద్ద నోట్ల రద్దు దశలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలోని అంశాలను ఇండిపెండెంట్ ఎంపి, న్యాయవాది కపిల్ సిబల్ ప్రస్తావించారు. చలామణిలోని నగదు అంతా కూడా అవినీతి స్థాయికి లెక్కగా నిలుస్తుందని , పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్‌మనీ పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తుందని ఆయన చెప్పారని ఈ క్రమంలో 2016లో చలామణిలో ఉన్న నగదు రూ 17.7 లక్షల కోట్లు,

ఇది నల్లధనం లేదా అవినీతి సొమ్ము అని ప్రధాని మోడీ నిర్థారణ చేసుకుంటే ఆ తరువాత 2022 లెక్కల ప్రకారం చలామణిలోని నగదు మొత్తం 30.18 లక్షల కోట్లు అని మరి అవినీతి పెరిగిందని ప్రధాని మోడీ అంగీకరిస్తారా? ఏం జవాబు ఇస్తారని సిబల్ ప్రశ్నించారు. కేవలం ప్రధాన విషయాల గురించి ప్రజలను పక్కదోవపట్టించడం లేదా, ప్రతిపక్షాలపై నిందలు వేయడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News