న్యూఢిల్లీ : 2034 లోక్‌సభ ఎన్నికలకు కానీ మహిళా రిజర్వేషన్ అమలు లోకి రాదని , ఇది కేవలం రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఆదివారం వెల్లడించారు. దిల్‌సే అనే పక్షపత్రికు ఇచ్చిన ఇంటర్వూలో కపిల్ సిబిల్ ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు మహిళా రిజర్వేషన్ అమలు తీరుపై కూడా చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అడగ్గా ఈ బిల్లు తక్షణం ప్రవేశ పెట్టడంలోని ప్రభుత్వ నిజాయితీపై సందేహం వెలిబుచ్చారు. వారికే అసలు అమలు చేయాలన్న నిజాయితీ ఉన్నట్టయితే 2014లోనే ఇది అమలై ఉండేదన్నారు. ఎప్పుడు ఈ బిల్లు అమలు లోకి వస్తుందని అడగ్గా, 2029 నాటికి కానీ ఇది అమలు లోకి రాదని స్పష్టం చేశారు.
దీనికి కారణం చెబుతూ ఆఖరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన 1976లో జరిగిందని, అప్పటి 84 వ రాజ్యాంగ సవరణలో నియోజక వర్గాల పునర్విభజన మరేమీ చేయవద్దని చెప్పిందన్నారు. “ఇప్పుడు 2026, అంటే జనాభా గణన ప్రారంభిస్తే, ఇది భారీ కసరత్తు అవుతుంది. ప్రస్తుత దేశ జనాభా 1.4 బిలియన్ మంది ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి ఒకటిన్నర సంవత్సరాలు అవుతుంది. అదొక్కటే కాదు, ఉత్తరాదిలో కులాల వారీగా గణన చేయాలన్న భారీ డిమాండ్ ఉంది. దీనికి బీజేపీ వ్యతిరేకించక పోవచ్చు. ఒకవేళ వ్యతిరేకిస్తే ఎన్నికల్లో బీజేపీ బాగా సష్టపోతుంది. అందువల్ల ఇదంతా చాలా సుదీర్ఘకాల ప్రక్రియే అవుతుంది. అందువల్ల తొలి మహిళా రిజర్వేషన్ అమలు లోకి వచ్చేసరికి 2034 అవుతుంది” అని సిబాల్ అన్నారు.
బీఎస్‌పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన తీవ్ర అవమానకర వ్యాఖ్యలపై స్పందిస్తూ దీనికి బీజేపీ ఎంపీని పార్లమెంట్ నుంచి తప్పనిసరిగా బహిష్కరించాలని సూచించారు.
తన 30 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంట్ సభ్యునిగా అలాంటి దుర్భాష తానెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ కె. సురేష్ రికార్డు పరిశీలించి ఆ వ్యాఖ్యలను తొలగిస్తాననడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సిబల్ వ్యాఖ్యానించారు. డానిష్ అలీ కమ్యూనిటీకి చెందిన సభ్యుడు మరెవరైనా అదే తప్పు చేస్తే ఏం జరిగి ఉండేది ? సభాధ్యక్ష స్థానంలో ఉండేవారు ఏం చేసేవారు ? అని ప్రశ్నించారు. ఈ విధమైన ద్వేషం సమాజంలో నెలకొందని, ఏదైనా ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఏదైనా మాట్లాడవచ్చు. దాని నుంచి బయటపడవచ్చు. అని సిబల్ వ్యాఖ్యానించారు. గత వారం పార్లమెంట్‌లో ఆమోదం పొందిన