Monday, December 23, 2024

రాజకీయాల్లో ఇదో కొత్త పతనం : ఈడీ తీరుపై కపిల్ సిబల్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రోత్సాహ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) అటాచ్ చేయడంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ బుధవారం ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఇదో కొత్త పతనంగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న వారి ఆసక్తుల మేరకు ఈడి పనిచేస్తోందని ఆరోపించారు. ఆ పత్రికను నడుపుతున్న కంపెనీయే దివాలా తీసినప్పుడు కంపెనీ షేర్‌హెల్డర్లకు ఏదీ వర్తించబోదని, అందువల్ల ఎవరు ఎవర్ని మోసం చేశారన్న ప్రశ్నే రాదని పేర్కొన్నారు.

విశ్వాసానికి భంగం ఎక్కడ ? ఎవరు కుట్ర పన్నారు ? వారికి న్యాయం తెలుసని అనుకుంటాను. కోర్టులకు కూడా న్యాయం తెలుసని భావిస్తాను. అందువల్ల ఈ విషయంలో తికమకపడుతున్నాను అని సిబల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈడీ చర్య ప్రతీకార వ్యూహంగా కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ కూటమిలో ఈడీ భాగస్వామిగా ధ్వజమెత్తింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News