Thursday, January 23, 2025

డబుల్ ఇంజన్ కాదు.. డబుల్ బ్యారెల్: సిబల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏజన్సీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్రంగా మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆదివారం రాంలీలా మైదానంలో ఆమ్ ఆదీపార్టీ మహార్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కపిల్ సిబల్ పాల్గొన్నారు.

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదు, డబుల్ బ్యారెల్ ప్రభుత్వం. ఒక బ్యారెట్ ఇడి అయితే మరోటి సిబిఐ. ఢిల్లీని బ్యూరోక్రాట్లతో పాలించాలని కేంద్రం కోరుకుంటోంది. సిఎంకు ఏ అధికారాలు లేకుండా చేయాలనుకుంటోంది. ఇది ఎలాంటి జోక్ అనాలి?’ అని సిబల్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News