Tuesday, November 5, 2024

తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావలసిన అవసరం ఉందన్న ప్రధాని నరేంద్ర మోడీపై కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ వ్యాంగ్యాస్త్రాలను సంధించారు. ప్రధాని ప్రతిపాదన ఎంతమేరకు ‘యూనిఫామ్’గా ఉంటుంది, అది హిందువులు, గిరిజనులు, ఈశాన్య రాష్ట్రాలు అందరికీ వర్తిస్తుందా? అంటూ ప్రశ్నలు సంధించారు.‘ ప్రధాని మోడీ ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.

ప్రతిపక్షాలు ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఆయనకు నా ప్రశ్నలు ఇవే. తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడే ఇది ఎందుకు గుర్తువచ్చింది? 2024 ఎన్నికల కోసమేనా? మీ ప్రతిపాదన ఎంత ‘యూనిఫామ్’. హిందువులు, గిరిజనులు, ఈశాన్యరాష్ట్రాలకూ వర్తిస్తుందా? ప్రతి రోజూ మీ పార్టీ ముస్లింలను టార్గెట్ చేస్తోంది. ఇప్పుడే వాళ్లపై ఎందుకు ఇంత ప్రేమ?’అంటూ సిబల్ ట్విట్టర్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News