Thursday, December 12, 2024

హర్షిత్ ఎంపికపై వివాదం…. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇద్దరు ఆటగాళ్లు అరంగ్రేటం చేశారు. హైదరాబాదీ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో మెరుపు మెరిపించాడు. కానీ అది ఓటమి నుంచి తప్పించలేకపోయింది. నితీశ్ కుమార్ రెడ్డిపై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించాడు. హర్షిత్ రాణా తొలి టెస్టులో రాణించినప్పటికి రెండో టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో హర్షిత్ పై విమర్శలు వస్తున్నాయి. హర్షిత్ బదులు ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణను తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. హర్షిత్ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ కావడంతో జట్టులోకి తీసుకొని ఉంటారని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విమర్శలపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తనదైన శైలిలో చురకలంటించాడు. టీమిండియాలో ఎవరు ఉండాలనేది కొందరు నిర్ణయం తీసుకుంటారని, అది తన పని కాదన్నారు.

తాను చెప్పినంత మాత్రాన జట్టులో పెద్దగా మార్పులు ఉండవన్నారు. ఇప్పటికైనా టీమిండియా జట్టు ఎంపికలో మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. బిసిసిఐ తీసుకునే నిర్ణయాలపై తాను జడ్జ్ చేయలేనని వివరణ ఇచ్చారు. అసలు ఇలాంటి విషయాలపై మనం మాట్లాడడం సరికాదని, టీమిండియా జట్టు మాజీ సహచరులే ఈ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారని కపిల్ దేవ్ ఎద్దేవా చేశారు. గబ్బాటెస్టులో హర్షిత్ రాణాకు బదులుగా ఆకాశ్ దీప్ తీసుకుంటే బాగుంటుందని మాజీ ఆటగాడు మంజ్రేకర్ సెలక్షన్ కమిటీకి సలహా ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News