Thursday, January 23, 2025

‘వరల్డ్ కప్ ఫైనల్ కు నన్ను పిలవలేదు’

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ ఫైనల్ కు బిసిసిఐ అనేకమంది క్రికెటర్లకు ఆహ్వానాలు పంపింది. ఈ జాబితాలో ప్రస్తుత ఆటగాళ్లతోపాటు మాజీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. కానీ 1983లో ఇండియాకు తొలిసారి ప్రపంచ కప్ అందించిన జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ ను మరచిపోయిందట. ఎంత విచిత్రం? ఈ విషయాన్ని కపిల్ దేవ్ ఏబిపి న్యూస్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు.

ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందు రోజు జరిగిన ఈ ఇంటర్వ్యూలో ‘ఫైనల్ చూసేందుకు వస్తున్నారా?’ అని అడిగితే ‘నాకు బీసిసిఐ ఆహ్వానం పంపలేదు. కాబట్టి నేను వెళ్లను. అంతే’ అని కపిల్ బదులిచ్చాడు. ‘నిజానికి 1983లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యులందరినీ ఈ మ్యాచ్ కు ఆహ్వానించాలి. అయితే పనుల ఒత్తిడిలో మమ్మల్ని ఆహ్వానించాలన్న విషయాన్ని మరచిపోయినట్లున్నారు’ అని కపిల్ బిసిసిఐకి చురకలు అంటించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News