రెడ్లను దూరంపెట్టిన పవన్
మనతెలంగాణ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఏపి నుంచి తెలుగుదేశం బిజేపిలతో జట్టు కట్టి పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో 21అసెంబ్లీ స్థానాలనుంచి అభ్యర్ధులను పోటీకి దింపుతోంది. ఇప్పటికే 18స్థానాల్లో పార్టీ అభ్యర్ధులును జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. అందులో అత్యధిక స్థానాలను తన సామాజిక వర్గం వారికే కేటాయించారు. రెడ్లకు ఒక్కసీటు కూడా కేటాయించలేదు.పార్టీ అధినేత పవన్ రెడ్లను ఈ ఎన్నికల్లో పూర్తిగా దూరం పెట్టేశారు.మొత్తం స్థానాల్లో మహిళకు ఒక స్థానం కేటాయించారు. షెడ్యుల్ తెగలు , షెడ్యూల్ కులాల వారికి రిజర్వ్ చేసిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన 14 నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాలకు కాపు సామాజిక వర్గం అభ్యర్ధులనే ఎంపిక చేశారు.
ఒక సీటును క్షత్రిక సామాజిక వర్గానికి కేటాయించారు. మిగిలిన మూడు స్థానాలు బిసిలకు కేటాయించారు. జనసేన పార్టీ ప్రకటించిన 14జనరల్ సీట్లలో కాపుసామాజిక వర్గం వారికి కేటాయించిన 10 స్థానాల్లో శెట్టిబలిజ కులాన్ని పూర్తిగా పక్కన పెట్టి కాపు సామాజిక వర్గానికే పెద్ద పీట వేశారు. పార్టీ అధినేత పవన్ ప్రకటించిన స్థానాల్లో
పిఠాపురం : పవన్ కళ్యాణ్ (కాపు),
కాకినాడ రూరల్ : పంతం నానాజీ (కాపు),
రాజానగరం : బత్తుల బలరామ కృష్ణ (కాపు),
తెనాలి : నాదెండ్ల మనోహర్ (కమ్మ),
నిడదవోలు : కందుల దుర్గేష్ (కాపు),
పెందుర్తి : పంచకర్ల రమేష్ (కాపు),
ఎలమంచిలి : విజయ్ కుమార్ (కాపు),
భీమవరం : పులవర్తి ఆంజనేయులు (కాపు),
ఉంగుటూరు : ధర్మరాజు (క్షత్రియ)
తిరుపతి : ఆరని శ్రీనివాసులు (బలిజ కాపు),
తాడేపల్లిగూడెం : బోలిసెట్టి శ్రీనివాస్ (కాపు), అభ్యర్దులను ప్రకటించారు. తీసుకున్న 21 సీట్లలో ఇప్పటివరకు 18 సీట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరో మూడు అంసెబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించాల్సివుంది.