Saturday, December 28, 2024

సోషల్ మీడియాలో అశ్లీల ఫోటోలు…. అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: ఓ మహిళ అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఓ వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన పంజాబ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. పంజాబ్‌లోని కాపుర్తాలా ప్రాంతంలో అమన్‌దీప్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పాటు అసభ్యకరమైన కామెంట్లు కూడా చేశాడు. ఫేక్ ఇన్‌స్టా గ్రామ్ ఎకౌంట్‌లో ఓ మహిళ వ్యక్తిగత ఫోటోలు, అసభ్యకరమైన కామెంట్లు ఉన్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు 354 సి, 354డి, 469, 67 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపి అడ్రస్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పంజాబ్‌లోని కుపార్తాలా నుంచి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:  ఆ మామిడిపండు ధర వింటే షాక్ అవుతారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News