Monday, December 23, 2024

150 మోస్ట్ లెజెండరీ డెజర్ట్ ప్లేసెస్‌లో హైదరాబాద్ కరాచీ బేకరీకి చోటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశవ్యాప్తంగా పేరుపొందిన హైదరాబాద్‌కు చెందిన కరాచీ బేకరీ అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ప్రపాచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 150 డెజర్ట్ ప్లేసెస్‌లో హైదరాబాద్‌కు చెందిన కరాచీ బేకరీ 29వ స్థానాన్ని సంపాదించుకుంది. టేస్ట్ అటాస్ ఈ జాబితాను రూపొందించి తన వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది.

కరాచీ బేకరీలో తయారయ్యే ఫ్రూట్ బిస్కెట్లు ఎంతో రుచికరంగా ఉంటాయని, వీటి ప్రత్యేకత మరెక్కడా లభించదని టేస్ట్ అట్లాస్ పేర్కొంది. హైదరాబాద్‌లోని మొజంజాహి మార్కెట్‌లో 1953లో స్థాపించిన కరాచీ బేకరీ ఇప్పుడు బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో కూడా తన శాఖలను విస్తరించింది. కరాచీ బేకరీ తన ఆహార ఉత్పత్తులను అమెరికా, యూరపు, ఆసే్లియా, మిడిల్ ీస్ట తో సహా అనేక దేశాలకు ఉత్పత్తి చేస్తోంది.

టేస్ట్ అట్లాస్‌లో స్థానం సంపాదించుకున్న దేశంలోని ఇతర డెజర్ట్ ప్లేసెస్:
1. కయని బేకరీ, పుణె(18వ ర్యాంకు).
2. కెసి దాస్, కోల్‌కత(25).
3. ఫ్లరీస్, కోల్‌కత(26వ ర్యాంకు).
4. బలరాం మల్లిక్ అండ్ బధరమ్న్ మల్లిక్, కోల్‌కత(37).
5. కె.రుస్తమ్ అండ్ కో, ముంబై(49).
6. కురేమాల్స్ కుల్ఫీ, న్యూఢిల్లీ(67).
7. ప్రకాష్ కీ మషూర్ కుల్ఫీ, లక్నో(77).
8. చిటాలే బంధు, పుణె(85).
9. జిలేబీ వాలా, న్యూఢిల్లీ(93).

150 మోస్ట్ లెజెండరీ డెజర్ట్ ప్లేసెస్‌లో మొదటి స్థానం లిస్కబ్‌కు చెందిన పేస్టీస్ డె బెలేమ్‌కు దక్కగా రెండవస్థానం ఇస్లాన్‌బుల్‌లోని హఫీజ్ ముస్తఫాకు లభించింది. వియన్నాలోని కేఫ్ సెంట్రల్ మూడవ స్థానాన్ని, మెక్సికో సిటీలోని పాస్టెలేరియా ఐదియల్ నాలుగవ స్థానాన్ని, న్యూ ఆర్లియన్స్‌లోని కేఫ్ డూ మాండె ఐదవ స్థానాన్ని దక్కించుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News