ఎస్ఎస్ రాజమౌళి.. భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకి ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి సినిమాకి ముందు కేవలం ఇండియా వరకే పరిమితమైన జక్కన ఆ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’తో మరో గ్రాండ్ సక్సెస్‌ను అందుకొని తనకు తానే సాటి.. తనకు లేరెవరూ పోటీ అని నిరూపించుకున్నారు.
అయితే ఈ దర్శకధీరుడి సినిమాలపై బాలీవుడ్ దర్శకుడు, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంచలన కామెంట్స్ చేశారు. రాజమౌళీ సినిమాల్లో ఎలాంటి లాజిక్ ఉండదు అని ఆయన అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం ఎంచుకున్న కథను నమ్ముకోవడమే అన్నిటికన్న ముఖ్యం. సినిమా నచ్చితే ఎవరూ లాజిక్స్ పట్టించుకోరు. ఉదాహరణకి రాజమౌళి సర్ సినిమాల్లో లాజిక్స్ గురించి ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే అది ఆయనకు కథపై ఉండే నమ్మకం. యానిమల్, ఆర్ఆర్ఆర్, గదర్ ఈ సినిమాలు అన్ని ఇదే ఫార్ములాతో హిట్ అయ్యాయి’’ అని అన్నారు.