హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి దారి దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగుతోకి వచ్చాయి. కానిస్టేబుల్ రాజునాయక్ పై పాల్పడిన కరణ్ సింగ్ పై నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు కరణ్ సింగ్ మైనర్ స్టేజ్ నుంచే నేరాలకు అలవాటు పడినట్లు విచారణలో వెల్లడైంది. వైట్ నర్ వంటి మత్తు పదార్థాలు తీసుకోవడం, అమ్మాయిల్ని వేధించడం.. దాడి చేసి డబ్బు, నగలు దోచుకోవడమే కరణ్ సింగ్ పనిగా మార్చుకున్నాడు. నిందితుడు కరణ్ తో కలిసి మరో పది మంది నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
బైకులు చోరీ చేసి అత్తాపూర్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ల, పహాడీషరిఫ్ లతో హల్ చల్ చేస్తున్నారు. కరణ్ సింగ్ మత్తులో ఓఆర్ఆర్ లో రాత్రిపూట అమ్మాయిల కోసం నిత్యం చక్కర్లు కొట్టేవాడు. వారి వద్దకు వెళ్లే విటులే టార్గెట్ గా కరణ్ సింగ్ దారిదోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు. కరణ్ సింగ్ పై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఐదు కేసులు, మైనర్ స్టేజ్ లోనే 3 కేసులున్నాయి. కరణ్ కరీంనగర్ లో ఖరీదైన కారు చోరీచేశాడు. గతంలో జగద్గిరిగుట్లలో ప్రేమ పేరుతో మైనర్ ను కరణ్ సింగ్ వేధించినట్లు తెలింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కరణ్ సింగ్ పై ఇప్పటికే రౌడీషీట్ నమోదైందని పోలీసులు వెల్లడించారు.