మహబూబ్‌నగర్ : కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ ఫౌండర్ , ఏడో డాన్ జహంగీర్ పాషాఖాద్రీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని మహత్మాగాంధీ రోడ్డు స్కూల్ ఆవరణలో విద్యార్థులకు వార్షిక కరాటే బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ మహేష్ తన కార్యాలయంలో బెల్టు గ్రేడింగ్ పరీక్షలో బెల్టులు పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ విద్యార్థులను అభినందించారు.
డీఎస్పీ మహేష్ మాట్లాడుతూ మంచి ఫిట్‌నెస్, ఆత్మరక్షణ కోసం కరాటే మార్షల్ ఆర్ట్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రీడాభివృద్దికి ఎంతో కృ,ఇ చేస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ఎన్నో స్టేడియంల నిర్మాణం అవుతున్నదని అన్నారు. జిల్లా కేంద్రంలో కరాటే శిక్షణ కోసం 1000 గజాల స్థలం , రూ. 10లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కరాటేలో విద్యార్థులు రాణించాలని కోరారు.
కింగ్ షోటోకాన్ క్లబ్ మాష్టర్ జహంగీర్ పాషా ఖాద్రి విద్యార్థులకు కరాటే బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించి తన చేతిలో మీదుగా సర్టిఫికెట్లు ఇప్పియ్యడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కింగ్ షోటో కాన్ క్లబ్ చైర్మన్ లక్ష్మణ్, వైస్ చైర్మన్ చెన్న వీరయ్య, బ్లాక్ బెల్ట్ అర్మ్ జమీల్, సినియర్ విద్యార్థులు పాల్గొన్నారు.