Monday, December 23, 2024

కరాటే ఆత్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది

- Advertisement -
- Advertisement -

బోధన్ : కరాటే ఆత్మ రక్షణతో పాటు ఆత్మ విశ్వాసం, శారీరక దృఢత్వం కల్పిస్తోందని కరాటే మాస్టర్ ఆశోక్ రోడే సూచించారు. శనివారం మారుమూల గ్రామమైన బోధన్ మండలం ఖండ్‌గావ్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు కరాటే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెమలి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ… విద్యార్థిని విద్యార్థులు కరాటే శిక్షణకు మక్కువ చూపాలని అన్నారు.

ఈ శిక్షణ ఆత్మ విశ్వాసం పెరగడంతో పాటు రక్షణకు కరాటే శిక్షణ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కరాటే శిక్షణను ఉచితంగా అందిస్తున్న ఆశోక్ రోడేకు ప్రత్యేక కృతజతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసి చైర్మన్, శ్యామ్‌రావు, ఉపాధ్యాయులు బాలాజీ, రేణుక, వీరేష్ బాబు, గంగాశంకర్, లక్ష్మీ, రేఖ, గ్రామపెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News