- Advertisement -
హైదరాబాద్: అసభ్యకర ప్రాంక్ యూట్యూబ్ ఛానళ్లపై నటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 20 యూట్యూబ్ ఛానళ్లపై సాక్ష్యాధారాలతో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. కళ్యాణి ఫిర్యాదుతో ఐటి యాక్ట్ లోని 67ఎ,509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెళ్లపై నిఘాతో పాటు కేసు విచారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు అప్లోడ్ చేస్తున్నాడని యూట్యూబర్ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -